అంగరంగ వైభవంగా అల్లు అర్జున్‌ పెళ్ళి

యువహీరో అర్జున్‌, స్నేహారెడ్డిల వివాహం అంగరంగవైభవంగా జరిగింది. హైటెక్స్‌ నోవాటెల్‌లో ఆదివారం రాత్రి 10:33 నిమిషాలకు జరిగిన ఈ వివాహావేడుకకు రాజకీయ, సినీరంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, అనాధికారులు హాజరై వధువరులను ఆశీర్వదించారు. కళ్యాణవేదికను భారీ సెట్టింగ్‌తో అలంకరించారు. స్నేహారెడ్డి తల్లిదండ్రులు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు కన్యాదానం చేశారు. ఈ వివాహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి దంపతులు, కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రులు డి.కె.అరుణ, జానారెడ్డి, ముఖేష్‌గౌడ్‌, పొన్నాల లక్ష్మయ్య, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి, ఈనాడు సంస్ధల అధినేత రామోజీరావు, ఆంధ్రప్రభ ఎడిటర్‌ పి.విజయబాబు, పారిశ్రామిక వేత్త టి.సుబ్బిరామిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌, డిజిపి అరవిందరావు, సినీప్రముఖులు డి.రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, వెంకటేశ్‌, సుమన్‌, మోహన్‌బాబు, బాలకృష్ణ, కోటశ్రీనివాసరావు, రానా, ప్రభాష్‌, రామ్‌చరణ్‌ తేజ్‌, చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజా హాజరయ్యారు.
Allu Arjun - Marriage Gallery Allu Arjun Wedding Engagement Photos