Pawan Kalyan







'గబ్బర్ సింగ్' ఆల్‌ టైమ్‌ ఇండస్ర్టీ రికార్డులు

పవన్ కళ్యాణ్ సక్సెస్ దాహం తీరింది. సినిమా కలెక్షన్ల సునామీని కంటిన్యూ చేస్తూనే వుంది. చాలా చోట్ల మల్టిప్లెక్స్ లలో మిగతా సినిమాలు తీసేసి.. కేవలం గబ్బర్ సింగ్ నే ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్ లు కనిపిస్తున్నాయి. మూడో రోజు కూడా బ్లాక్ లో టిక్కెట్లు అమ్మటం ఈ సినిమా విజయం రేంజి ని తెలుపుతోందని చెబున్నారు. సినిమాకు ప్లస్ అయిన ఎంటర్టన్మెంట్ గురించి అంతటా హాట్ టాపిక్ గా నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత పవన్ కి వచ్చి ఈ హిట్ అని ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు.

గబ్బర్ సింగ్ మూడు రోజుల షేర్ వివరాలు:

నైజం- 5.74 కోట్లు
సీడెడ్- 3.50 కోట్లు
వైజాగ్- 1.27 కోట్లు
ఈస్ట్- 1.36 కోట్లు
వెస్ట్- 1.10 కోట్లు
గుంటూరు-1.77 కోట్లు
కృష్ణ- 1.17 కోట్లు
నెల్లూరు- 0.69 కోట్లు
కర్నాటక- 1.63 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.14
ఓవర్ సీన్- 6.28
వరల్డ్ వైడ్ షేర్- 25.65 కోట్లు.. ఇది ఆల్‌ టైమ్ ఇండస్ర్టీ రికార్డుగా ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

గబ్బర్ సింగ్‌ ఎఫెక్ట్

పవన్‌ 'గబ్బర్‌సింగ్‌' ఎఫెక్ట్ ఇతర సినిమాలపై పడుతున్నట్టే ఉంది. మాస్‌రాజా రవితేజ అప్‌కమింగ్‌ మూవీ దరువు వాయిదా పడింది. ఈ నెల 18న విడుదల కావాల్సిన ఈ సినిమాను 25కు పోస్ట్‌పోన్ చేశారు. గబ్బర్ సింగ్‌కు వస్తున్న కలెక్షన్ల ప్రభావంతోనే దరువును వాయిదా వేసినట్టు తెలుస్తోంది.