Movies

తెలుగు


Telugu Movie Latest News and GossipsContract All | Expand All

ఘనంగా దూకుడు ఆడియో వేడుక

ఎప్పుడూ ఆడియో ఫంక్షన్ ని జరుపుకొని మహేష్ ఈ సారి మాత్రం అభిమానుల కోలాహలం మధ్య శిల్పకళావేదికలో అట్టహాసంగా దూకుడు ఆడియో కార్యక్రమాన్ని జరుపుకున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల - ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో 14 రీల్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్ర ఆడియో కార్యక్రమానికి మహేష్, నమ్రత, శ్రీనువైట్ల, రాజమౌళి, సుకుమార్, బ్రహ్మానందం, తమన్, సమంతా, కోన వెంకట్, దిల్ రాజు...తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

దూకుడు చిత్రానికి తమన్ అందించిన సంగీతం అందరిని ఆకట్టుకుంది. ఆడియో ఫంక్షన్ లో పాటల విడుదలను కొత్త తరహాలో ఒక్కో పాటని పాడుతూ...ఒక్కో పాటకి ఆడుతూ వెరైటీగా విడుదల చేయటం జరిగింది. ఇదే ఫంక్షన్ లో దూకుడు చిత్రంలోని కొన్ని విజువల్స్ ని ప్రత్యేకంగా చూపించి అభిమానులని మరింత ఆనందపరిచారు. విజువల్స్ లో మహేష్ చెప్పిన కొన్ని డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

చిత్రంలో మహేష్ కొట్టగా కనిపిస్తాడని...ఇన్ని రోజులు అభిమానులని వైట్ చేయించినందుకు..తప్పకుండా ఈ చిత్రం అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ దాటుతుందని...శ్రీనువైట్ల అన్నారు. అభిమానులలానే తాము కూడా చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నాం అని శ్రీనువైట్ల, మహేష్, సమంతా అన్నారు.
Dookudu Audio Released in Style.
The audio of Prince Mahesh’s latest action-packed romantic entertainer ‘Dookudu’ has been released in a grand style amidst celebrities and hundreds of fans.


పూలరంగడుగా సునీల్‌

హాస్యనటుడు సునీల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పూలరంగడు’. ‘ప్రేమకావాలి’ ఫేం ఇషాచావ్లా నాయిక. ‘అహ నా పెళ్లంట’ ఫేం వీరభద్రమ్‌ దర్శకుడు. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ సమర్పణలో మాక్స్‌ఇండియా పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో సినిమా ప్రారంభమైంది. నాయకానాయికలపై తొలిసన్నివేశానికి ఎస్‌.ఎస్‌. రాజమౌళి క్లాప్‌నివ్వగా, సుకుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వి.వి.వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. సునీల్‌, ఇషాచావ్లా, కె.అచ్చిరెడ్డి, వీరభద్రమ్‌, అలీ, అనూప్‌ రూబెన్స్‌, సురేష్‌రెడ్డి, శ్రీధర్‌ సీపాన తదితరులు వేడుకలో పాల్గొన్నారు.

సునీల్‌ మాట్లాడుతూ ‘కథ నచ్చి..ఆర్‌ఆర్‌ సంస్థలో ఈ సినిమా చేయాలని భావించాను. నటనకు ఆస్కారమున్న కథాంశమిది. హాస్యం, డాన్సులకు ప్రాధాన్యముంది’ అన్నారు. వీర భద్రమ్‌ మాట్లాడుతూ ‘సునీల్‌ శరీరభాషకు సరిపడే కథాంశమిది. టైటిల్‌కి మంచి స్పందన వచ్చింది’ అన్నారు. కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘‘సునీల్‌ పూలరంగడు అనగానే అంతటా ఆసక్తి నెలకొంది. సంగీత ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. కశ్యప్‌ సంగీతం అలరిస్తుంది. నటునిగా కొత్తగా ఏదైనా చేయాలని తపించే నటుడు తను. మరో విజయం అందుకుంటాడు. సెప్టెంబర్‌ 2నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళుతున్నాం. సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం’ అన్నారు.


రవితేజ సినిమా ప్రారంభం!

రవితేజ హీరోగా కొత్త సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘శౌర్యం’ ఫేం శివ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీమతి నాగమునీశ్వరి సమర్పకురాలు. సంస్థ కార్యాలయంలో దేవుని చిత్రపటాలపై తొలిసన్నివేశం చిత్రీకరించారు. రవితేజ మాట్లాడుతూ ‘శివ మాస్‌ పల్స్‌ బాగా తెలిసిన దర్శకుడు. సున్నితాంశాలు బాగా స్పృశిస్తాడు. తను చెప్పిన కథ ప్రేరేపించింది. ఓ మంచి బేనర్‌లో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రవితేజ ఇంతవరకూ చెయ్యని పాత్రలో కనిపిస్తున్నారు. అన్ని కమర్షియల్‌ విలువలున్న వినోదాత్మక చిత్రమిది.

మాంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఎనర్జీ హీరో రవితేజ అంటే ఇష్టం. మా బేనర్‌లో అతడికి ఇదే తొలిసినిమా. మా కాంబినేషన్‌లో మంచి సినిమా అవుతుంది’ అన్నారు. డారాజేంద్రప్రసాద్‌, డాబ్రహ్మానం దం, అలీ, ఎం.ఎస్‌.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, షాయాజీ షిండే, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంథోని, కెమెరా: వెట్రి, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, కథ: శివ, ఆది నారా యణ, కథ-కథనం-దర్శకత్వం: శివ.


‘మోక్షజ్ఞ’ ఎంట్రీతో జూ ఎన్టీఆర్ డేంజర్ లోపడే సూచన..!

తెలుగు పరిశ్రమలో ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం హీరో కొడుకులు హీరోగా వెండితెరపై అరంగ్రేటం చేయంట. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఫ్యామిలీ నుండి ఇద్దరు ముగ్గరు హీరోలు రావటంతో పెద్ద సమస్య వచ్చింది. నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే ముగ్గురు వెండితెరను ఏలుతున్నారు. బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా వెలుగుతున్నారు. ప్రస్తుతం ‘బాలకృష్ణ’ కొడుకు మోక్షజ్ఞ వెండితెరపైకి వచ్చిన రోజున, జూ ఎన్టీఆర్’కు పెద్ దెబ్బతగులుతుందని ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతోంది.

జూ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ప్రవేశించి ఇప్పటికే 11సంవత్సరాలు అయ్యింది. మోక్షజ్ఞ ప్రవేశంతో నందమూరి ఫ్యాన్స్ ‘మోక్షజ్ఞ’ వైపు మొగ్గుతారని ఊహిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కనుక మంచి నటుడైతే ఎటువంటి పరిస్థితులోనూ ఎన్టీఆర్ కెరియర్ కే దెబ్బ అని ఫిలింనగర్ వాసుల ఊహాగానాలు. అందుకు ఉదాహారణకు మెగా ఫ్యామిలి నిదర్శనం. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ రాకముందు అల్లు అర్జున్ కు ఎంతో ఫాలోయింగ్ ఉన్నింది. రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత అల్లు అర్జున్ పరిస్థితి కొంచెం ఇరకాటంలో పడిందని, రాబోయే రోజుల్లో రామ్ చరణ్ కి మెగా ఫ్యాన్స్ పట్టం కడతారని సినీజనాలు ఊహిస్తున్నారు. కాబట్టి మోక్షజ్ఞ వస్తే జూ ఎన్టీఆర్ కి కష్టాలు తప్పవేమో...!
This really is time stars to emerge from the film families. Now this became an interior rivalry. Focus is on Nandamuri family and a star war is emerging between two promising names that's Junior NTR and Mokshagna.


మూడో సినిమా పవన్ తో సూపర్ డూపర్ హిట్..!

తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా నటిస్తున్న 'కాళీ' (వర్కింగ్ టైటిల్) సినిమా రెండో షెడ్యులు షూటింగు ముగిసింది. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో ఈ షెడ్యులు జరిగింది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను, యాక్షన్ ఎపిసోడ్ ను, హీరో హీరోయిన్లపై పాటను చిత్రీకరించారు. శారాజెన్, అంజలీ లావానియా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అడవి శేషు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా అసలు టైటిల్ని పవన్ కల్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ రెండున ప్రకటిస్తారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేస్తున్న డివివి దానయ్య మరో కొత్త సినిమా కమిట్ కాబోతున్నాడు. బిందాస్, రగడ చిత్రాల డైరెక్టర్ వీరు పోట్ల డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీరు పోట్ల చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కి నచ్చడం వెంటనే దానయ్య ఈ సినిమా ప్రొడ్యూస్ చెయ్యడానికి ముందుకు రావడం జరిగిపోయాయి.వీరు పోట్ల డైరెక్ట్ చేసిన బిందాస్ హిట్ అయి, రగడ ఏవరేజ్ గా నిలిచింది. అయితే అతని డైరెక్షన్ లో రాబోయే ఈ సినిమాని డెఫినిట్ గా సూపర్ హిట్ చెయ్యాలనే పట్టుదలతో వున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా 2012 మధ్యలో ప్రారంభమై 2013లో రిలీజ్ అవుతుందని సమాచారం.
Power Star Pawan Kalyan soon going to act under 'Bindas' and 'Ragada' movie director Veeru Potla. Pawan Kalyan impressed Veeru Potla story and presently Veeru Potla preparing script for this movie. More news regarding this film will come out soon.


హజారే పోరాటానికి సౌత్ సినీస్టార్ మద్దతు

భారత్ అవినీతి రహిత దేశంగా మారాలంటే బలమైన ‘జన లోక్ బిల్లు’ రావాలనే డిమాండ్ తో పోరాటం చేస్తున్న సామాజిక వేత్త అన్నా హజారేకు సౌతిండియన్ సినీ స్టార్స్ మద్దతు ప్రకటించారు. అభిమానులు కూడా హజారే పోరాటానికి బాసటగా నిలవాలని కోరుతూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా పిలుపునిస్తున్నారు.

‘రేపటి ప్రకాశవంతమైన, అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలంటే...ఈ రోజే అన్నా హజారే పోరాటానికి మద్దతు ఇవ్వండి’ అని అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని దోచుకు తింటున్న రాజకీయ నాయకులు, అధికారుల భరతం పట్టేందుకు, అన్నాకు అండగా నిలవాలని దర్శకుడు రమేష్ అరవింద్ కోరారు. అన్నాకు మరింత ప్రజా శక్తి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు హీరోయిన్ రమ్య తెలిపింది. తెలుగు పాప్ సింగర్ స్మిత కూడా ట్వట్టర్ ద్వారా హజారే ఉద్యమానికి సపోర్టు ఇచ్చింది. వీరి దారిలోనే మరి కొందరు సీనీ తారలు ట్విట్టర్-ఫేస్ బుక్ ద్వారా అభిమానుల్లో చైతన్యం తెస్తున్నారు.
South Indian film personalities have thrown their weight behind Anna Hazare's demand for a strong anti-corruption bill, with actor Nagarjuna urging the people to support the Gandhian "for a brighter India" and director Ramesh Arvind saying "Anna Hazare and his team's demands are not unjust"


సెక్సీ సుందరిపై దర్శకనిర్మాతలు అంతర్ యుద్దం...!

అసిన్ నటించిన ‘గజిని’ సుమారు రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది. అసిన్ నటించిన మరో చిత్రం ‘రెడీ’ కూడా వంద కోట్లు పైగా కలెక్ట్ చేసింది. కరీనా కపూర్ ను మినహాయిస్తే..బాలీవుడ్ లో వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసిన రెండు చిత్రాల్లో నటించిన హీరోయిన్లే లేరు. కరీనాకపూర్ నటించిన ‘3ఇడియట్స్’ తో పాటు ‘గోల్ మాల్3’కూడా వంద కోట్ల మార్క్ ను దాటాయి. అయితే కరీనా కపూర్ గత పదిపన్నెండు సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో చిత్రవిచిత్రమైన కష్టాలు ఎదుర్కొంటూ ఈ రికార్డును ఇప్పటికి సొంతం చేసుకుంది.

కానీ అసిన్ అలా కాదు ఆమె నటించినవే మూడు సినిమాలు. ఆమె ిమందీ రంగప్రవేశం చేసి కూడా మూడేళ్లు లోపే. మూడేళ్ల మూడు సినిమాలు..వాటిలో రెండు సినిమాలు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయడమంటే మాటలు కాదు. అయితే ఇదంతా అసిన్ ఘనత కాదని, కేవలం అదృష్ట కొద్దీ వచ్చిందని చెబుతూ ‘ఆమె జస్ట్ కమింగ్ యాక్ట్రెస్ మాత్రమే..స్టార్ కాదు’ అంటూ అసిన్ ను ఘోరంగం అవమానిస్తున్నారు బాలీవుడ్ లో కొందరు దర్శకనిర్మాతలు. హిందీ చిత్ర ప్రముఖుడైన నిర్మాత ముఖేష్ భట్ కూడా అసిన్ ని ద్వేషించే వారి జాబితాలో చేరాడు. అసిన్ కున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పలువురు దర్శకనిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అయితే సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే అసిన్..ఆ విషయంలో వారిని నిరాశకు గురి చేస్తున్నదని..దాంతో ఆమెను ఏదోవిధంగా అవమానించేందుకు అసిన్ స్టార్ కాదు అనే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారని అసిన్ సన్నిహితులు వాపోతున్నారు.
At a recent interview by a television channel, Mukesh was questioned about southern actresses making a mark in Bollywood. The filmmaker was specially asked about Asin’s rising popularity in B-Town. But the filmmaker had a different opinion about the actress and said, “I don’t feel that she has a great future in Bollywood.”


ఎన్టీఆర్‌తో కొత్త సినిమా

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సినిమా వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. బండ్ల గణేష్‌ ఈ చిత్రానికి నిర్మాత. బండ్ల శివబాబు సమర్పకుడు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘పూరి కాంబినేషన్‌లో మరో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబినేషన్‌ ఇది. మా కలయికలో సినిమా అంటే అంచనాలు పెద్ద స్థాయిలోనే ఉంటాయి. దర్శకుడు ఇప్పటికే అద్భుతమైన లైన్‌ సిద్ధం చేశారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఈ సినిమా నా కెరీర్‌కే ప్రతిష్ఠాత్మకం’’ అన్నారు. పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఎంతోకాలంగా అనుకుంటున్నా. ఓ మంచి ప్రేమకథ సిద్ధమైంది. హీరోని సరికొత్త కోణంలో ఆవిష్కరించే కథ ఇది. ఎన్టీఆర్‌ స్టైల్‌కి నా స్టైల్‌ జతకలిసి వైవిధ్యంగా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి కథ-కథనం- మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.


మళ్లీ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు?

చిరు కథానాయకుడిగా 1989లో విడుదలైన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ అప్పట్లో ఎంతటి సంచలనమో తెలిసిందే. ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది’ అంటూ మొండి అత్త వాణిశ్రీని చిరు ఏడిపించిన తీరు, జిత్తులమారి అత్త వేసే ఎత్తులను చిత్తు చేసే తీరు..నేటికీ ప్రేక్షకుల కళ్లముందు కదలాడుతుంది. చిరు శపథం చేసే తీరు, మెగాస్టార్‌లోని పంచ్‌ను కళ్లకుగడుతుంది. పదం విరుపుతో చిరు పలికిన సంభాషణలు..ఎన్నటికీి ప్రేక్షకులు మరువలేరు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట ‘మాప్పిళ్లై’గా రీమేకయి పెద్ద హిట్‌ కొట్టింది. అక్కడ రజనీకాంత్‌ అత్తగా శ్రీవిద్య నటించారు.

అమల కథానాయిక. అదే సినిమా రజనీ అల్లుడు ధనుష్‌ హీరోగా ఇటీవల రీమేకయి మరోసారి హిట్‌ సాధించింది. మనీషా కొయిలారా అత్తగా, హన్సిక నాయికగా నటించారు. ఈ నేపథ్యంలో ‘చిరుత’నయుడు యువహీరో రామ్‌చరణ్‌ తేజ్‌ హీరోగా ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సీక్వెల్‌ (వైవిధ్యమైన కథాంశంతో) తీస్తారనే వార్త వినవస్తోంది. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ఇప్పటికే వినాయక్‌ ఆస్థాన రచయిత ఆకుల శివ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో కొమ్ములు తిరిగిన అత్తగా ఎవరు నటిస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా ఒకప్పటి అందాల తార మీనా నటిస్తోందనే వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటినుంచే అభిమానులలో ఎంతగానో ఉత్సుకత నింపుతోంది.


అందుకే కోపం

బాలీవుడ్‌లో ‘గజనీ’ చిత్రంతో దక్షిణాది హీరోయిన్ల హవాను మళ్లీ మొదలుపెట్టిన అసిన్ చేతిలో చిత్రాలు బాగానే ఉన్నాయి. బిజీగానే ఉంటూ షూటింగ్‌లు చేస్తోంది. అయితే ఆమెకు ఎంతమంది మిత్రులు ఉన్నారో అంతమంది శత్రువులు కూడా తయారవుతున్నారన్నది నిజం. తాజాగా నిర్మాత ముఖేష్‌భట్ అసిన్‌పై కారాలుమిరియాలు నూరాడు. అసిన్ కేవలం రెండు హిట్లు ఇచ్చినంతమాత్రాన టాప్‌స్టార్‌గా ఎదిగినట్లు కాదని కొట్టిపారేశాడు. అసలు ఆమెకు ఇక్కడ భవిష్యత్ ఉంటుందని తాను అనుకోవడం లేదని, మళ్లీ బ్యాక్ టు పెవిలియన్‌లా కేరళ వెళ్లిపోతుందని జోస్యం కూడా చెప్పాడు. అందుకు అసిన్ స్పందిస్తూ ఆయన చిత్రంలో నటించలేదని, కాల్‌షీట్లు సర్దటంలో ఇబ్బంది పడడంతో తాను అలా వ్యాఖ్యానించి ఉండవచ్చని, అందుకే దుష్ప్రచారం చేస్తున్నాడని అసిన్ అంటోంది. దానికి సమాధానంగా ముఖేష్‌భట్ తాను అసలు సినిమా నిర్మించాలని అనుకోలేదని, అసిన్‌ను ఎలాంటి కాల్‌షీట్స్ అడగలేదని చెప్పుకొచ్చాడు. దీనికి సమాధానం అసిన్ ఏం చెబుతుందో త్వరలో విందాం.


రామనామ జపం: తమన్నా

శ్రీరామ నీనామమెంతో రుచిరా అంటూ అందాల భామ తమన్నా పాటలు పాడేసుకుంటోంది. అలాగని ఏదో భక్తి సినిమాలోనో కమర్షియల్‌ యాడ్‌లోనో నటించడంలేదు తమన్నా. దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని వరుసగా నాగచైతన్య, అల్లు అర్జున్‌లతో కలిసి నటించిన తమన్నాకు ఇప్పుడు భారీ ఆఫర్లే వస్తున్నాయి. తెలుగులో కాజల్‌తో పోటీపడుతూ...నువ్వా నేనా? అంటోంది. జూనియర్‌ నందమూరి తారక రామారావుతో కలిసి ‘ఊసరవెల్లి’ చిత్రంలో నటిస్తున్న తమన్నా హీరో రామ్‌ చరణ్‌తేజతో కలిసి ‘రచ్చ’లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు గాక ‘కందిరీగ’ చిత్రంతో మంచి జోష్‌మీద ఉన్న హీరో రామ్‌తో కలిసి ‘ఎందుకంటే ప్రేమంటే’లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ముగ్గురు హీరోల పేర్లలో రాముడిపేరు ఉండటం యాదృచ్ఛిచం. తమన్నా ఏకకాలంలో ముగ్గురు హీరో రాముళ్లతో నటించడం విశేషం.


సమీరా... కాలు జారిందా ?!

ఓ తమిళ సినిమా షూటింగు సందర్భంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ సమీరారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కోయంబత్తూరులో షూటింగు జరుగుతుండగా ఆమె తీవ్రగాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే ఆమె రెండు మూడు రోజులలో కోలుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తీవ్ర గాయాలైనప్పటికీ అంతగా ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో వెట్టై అనే చిత్రంలో సమీరా రెడ్డి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర హీరో ఆర్య కాగా ప్రముఖ హీరో మాధవన్‌ పోలీసు అధికారి పాత్రలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.వెట్టై సినిమా కోసం కోయంబత్తూరులో హీరో హీరోయిన్లతో వాన పాట చిత్రీకరణ చేస్తున్నారు. ఈ పాటలో సందర్భానుసారం సమీరా మోపెడ్‌పై వస్తుండగా నీటి ధాటికి ఆమె నడుపుతున్న మోపెడ్‌ స్లిప్‌ అయి జారి పడింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయాల య్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండు మూడు రోజులు రెస్టు తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఇదిలా ఉంటే సమీరాకు చాకులాంటి సౌత్‌ ఇండియా కుర్రాడినే పెళ్లి చేసుకుంటానంటోంది. మరి ఆమె మనసులో ఉన్న సౌత్‌ హీరోలలో టాలీవుడ్‌, కోలీవుడ్‌, మల్లూవుడ్‌, శాండల్‌వుడ్‌లలో ఎవరిని వరిస్తుందో చూడాలి.


'మహేష్‌' బిజినెస్‌ మొదలైంది!

మహేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బిజినెస్‌మేన్‌’. కాజల్‌ కథానాయిక.పూరి జగన్నాథ్‌ దర్శకుడు. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై డావెంకట్‌ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రదినోత్సవ ఫర్వదినాన ఈ సినిమా సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. దేవుని పటాలపై తొలిసన్నివేశాన్ని చిత్రీకరించారు. మహేష్‌ మాట్లాడుతూ ‘‘పూరితో ‘పోకిరి’ తర్వాత చేస్తున్న సంచలన చిత్రమిది. కథ విన్నప్పట్నుంచి చాలా ఉత్సుకతగా ఉన్నా. హీరో పాత్ర చిత్రణ అత్యద్భుతం. ఆర్‌.ఆర్‌ బేనర్‌లో సినిమా చేయడం చాలా సంతోషాన్నిస్తోంది. పూరితో నా కాంబినేషన్‌ను ఏ స్థాయిలో అంచనా వేస్తారో..అందుకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.

దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ‘పోకిరి లాంటి బ్లాక్‌బస్టర్‌నిచ్చాక..మరోసారి మహేష్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకోసం ప్రిన్స్‌ అభిమానులు సహా నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ కథాంశంపై చాలా నమ్మకంగా ఉన్నా. ఇంతవరకూ నేను చేసిన సినిమాలన్నిటిలో హీరో పాత్ర ది బెస్ట్‌ అనిపించేలా ఉంటుంది. ప్రేమ, యాక్షన్‌ ప్రధానాంశాలుగా ఉండే సినిమా ఇది. హీరో, దర్శకులను ఆకట్టుకునే గొప్ప నిర్మాత డావెంకట్‌. అలాంటి డైనమిక్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్‌ 1నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళతాం’ అన్నారు.

2012 సంక్రాంతి కానుక!
‘బిజినెస్‌మేన్‌’ వచ్చే సంక్రాంతికి మహేష్‌ అభిమానులకు, ప్రేక్షకులకు కానుకగా అందిస్తామని ..నిర్మాత డావెంకట్‌ అన్నారు. ప్రారంభోత్సవ వేళ మరిన్ని విశేషాలు ముచ్చటిస్తూ- ‘మా బేనర్‌లో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. మహేష్‌-పూరి అంటేనే క్రేజీ కాంబినేషన్‌. కథాంశం అద్భుతం.అభిమానులు, ప్రేక్షకులు ఎలా చూడాలనుకుం టున్నారో..మహేష్‌ అలాంటి పాత్రలోనే కనిపిస్తాడు. స్టైలిష్‌గా, లావిష్‌గా ఉన్నత సాం కేతిక విలువలతో రూపొందే చిత్రమిది. హీరో, దర్శకులపై పూర్తిస్థాయి నమ్మకముంది. అను కున్న ప్రకారం సినిమా పూర్తిచేసి జనవరి 12న విడుదల చేస్తాం. ఆర్‌.ఆర్‌ సంస్థ ఇమేజ్‌ పెంచే సినిమా ఇది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కెమెరా: శ్యామ్‌ కె.నాయుడు, కోడైరెక్టర్‌: విజయ్‌రామ్‌ప్రసాద్‌, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, కథ- కథనం- మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
Mahesh Businessman Business Ready


ఎన్టీఆర్‌తో చిరంజీవి ‘చుట్టరికం’

ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రధాన పోటీ నందమూరి, మెగాస్టార్ కుటంబీకులకు చెందిన నటుల మధ్యే. పైకి ఈ రెండు వర్గాలు కలిసి మెలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా తెరపై మాత్రం ఆధిపథ్యం కోసం నిత్యం పోరాడుతూనే ఉంటారు. వీళ్ల అభిమానులైతే ముఖాముఖి తలపడిన సందర్భాలు అనేకం. తెలుగు సినీ ప్రేక్షఃకులు విస్తుపోయేలా ఒకరి హీరోపై మరొకరు వ్యంగాస్త్రాలతో ఇంటర్నెట్ యుద్దం జరిగిన విషయమూ తెలిసిందే.

అయితే ఈ రెండు ప్రత్యర్థి వర్గాలు ఒక్కటి కాబోతున్నాయా? అంటే అవుననే సూచనలు స్పష్టంగా కనిపిస్తన్నాయి. నందమూరి, చిరంజీవి కుటుంబాల మధ్య త్వరలో బంధుత్వం కలవబోతుండటమే ఇందుకు కారణం. రామ్ చరణ్ పెళ్లి చేసుకోబోతున్న ఉపాసన కామినేని తాతయ్య సూర్య నారాయణ రావు.... సీనియర్ ఎన్టీఆర్ కు దగ్గరి బంధువు. రామ్ చరణ్ పెళ్లి ద్వారా నందమూరి-మెగాస్టార్ కుటుంబాలు ఒక్కటి కాబోతుండటంపై ఇటు ఫ్యాన్స్‌లోనూ ఆనందం నెలకొంది.

గతంలో మంచు విష్ణు పెళ్లి ద్వారా...వైఎస్ఆర్-మంచు కుటుంబాలు ఒక్కటైనట్లు, ఇప్పడు రామ్ చరణ్ పెళ్లి ద్వారా నందమూరి-మెగాస్టార్ కుటుంబాలు ఒక్కటి కాబోతున్నాయన్నమాట.
It is heard that Upasana's grandfather (father’s father) Kamineni Suryanarayana Rao is a close relative to the legend N T Rama Rao. So, the buzz is that once Cherry gets married, Chiru will become relative to NTR, Balayya and the Nandamuri family.


రచ్చ లేపనున్న చరణ్ ఫైట్లు

రామ్ చరణ్ తేజ త్వరలో రచ్చ సినిమా తో ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రం ఇప్పటికే శ్రీ లంక, బాంగ్ కాక్ నగరాలలో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో ఏక్షన్ సీన్లు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి అని చిత్ర నిర్మాణ వర్గం చెబుతోంది. రామ్ చరణ్ తేజ్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.

సంపత్ నంది దర్సకత్వం లో రూపొందుతున్న చిత్రంలో చరణ్ ,తమన్నా జంట గా నటిస్తున్నారు. చిత్రానికి మాటలు పరుచూరి బ్రదర్స్, పాటలు మణిశర్మ అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సెలవులకు సిద్ధం అవుతుందని తెలిసింది.
Mind blowing fights in Raccha!హీరోయిన్‌ సమీరా రెడ్డికి గాయాలు

* తమిళ చిత్ర షూటింగ్‌లో గాయపడ్డ సమీరా
* వేటై సినిమాలో పోలీస్‌ అధికారిణిగా నటిస్తున్న సమీరా రెడ్డి
* రెయిన్‌ సాంగ్‌ షూటింగ్‌లో జారిపడ్డ సమీరా
* వెహికిల్‌ అదుపుతప్పి పడిపోయిన సమీరా రెడ్డి
* కోయంబత్తూరులో వేటై సినిమా షూటింగ్‌

హీరోయిన్‌ సమీరా రెడ్డి తమిళ చిత్రం షూటింగ్‌లో గాయపడింది. కోయంబత్తూరులో షూటింగ్‌ జరుపుకుంటున్న వేటై సినిమాలో నటిస్తున్న సమీరా రెడ్డి.. టూ వీలర్‌ స్కిడ్‌ అవడంతో జారి పడింది. రెయిన్‌ సాంగ్‌ చిత్రీకరణ జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ సమీరాను వెంటనే అసుపత్రికి తరలించారు. వేటై సినిమాలో సమీరారెడ్డి, ఆర్య జంటగా నటిస్తున్నారు. మాధవన్‌ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు.
Actress Sameera Reddy Injured in tamil Cenima Shooting


అంచనాలు పెంచుతున్న దూకుడు ట్రైలర్స్

* టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న దూకుడు విజువల్స్
* ఈనెల 13న ఆడియో విడుదల
* శ్రీనువైట్ల దర్శకత్వంలో దూకుడు

శ్రీనువైట్ల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం దూకుడు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర రెండో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈనెల 13న ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Dukudu Latest Trailler


ప్రిన్స్ మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

నేడు తెలుగు చిత్ర పరిశ్రమకే అందగాడు, చక్కటి రూపం అభినయం కలిగిన యువరాజు, ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు. నేటితో మహేష్ బాబుకు 37 సంవత్సరాలు నిండుతాయి.రాష్ట్రమంతటా మహేష్ బాబు అభిమానులు ఇప్పటికే పండుగ చేసుకుంటున్నారు. రక్త దానం, ఆహార పంపిణి వంటి సామాజిక కార్యక్రమాలను అభిమానులు నిర్వహిస్తున్నారు.

అసమాన నటనా ప్రతిభ, చూడచక్కని రూపం కలిగిన మహేష్ బాబు తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణం. 1999 లో హీరోగా రంగప్రవేశం చేసిన మహేష్ బాబును ఇప్పటికే 6నంది అవార్డులు వరించాయి. స్వతహాగా మొహమతస్తుడైన మహేష్ బాబు తన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపటం ఇష్టపడతాడు.

ప్రస్తుతం మహేష్ బాబు “దూకుడు” షూటింగ్ నిమిత్తం హైదెరాబాద్ లోనే ఉన్నారు. దూకుడు మీద ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆడియో ఈ నెల 13వ తారీకున విడుదలయ్యే అవకాశం ఉంది. సినిమాను ఆగస్టు చివరి వరం లో కాని, సెప్టెంబర్ మొదటి వారం లో కాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

idlerelax.com మహేష్ బాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది
Happy Birthday Prince Prince Mahesh Babu


దూకుడే...దూకుడు

నేడు సూపర్‌స్టార్‌ మహేష్‌ అభిమానులకు పర్వదినం. 13వ తేదీన ’దూకుడు ఆడియో విడుదల...ఇదే నెలలో సినిమా విడుదల చేసేందుకు రంగం సిద్దం అయింది. ఈ దూకుడు చాలదన్నట్లు సూపర్‌ స్టార్‌ మహేష్‌ త్వరలో పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో నటించే ’బిజినేస్‌మేన్‌ చిత్రానికి సంబందించిన కధ కూడ సిద్దవమైపోయింది.

ఇక దర్శకుడు పూరి కూడా ఈ చిత్రాన్ని ’పోకిరి’ కి మించి హిట్‌ చేయాలని కసితో ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరగా పూర్తిచేసి వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ప్రముఖ మళయాల దర్శకుడు సంతోష్‌శివన్‌ కూడ ఇటీవల మహేష్‌బాబుతో సినిమా తీస్తానని ప్రకటించడం...క్రిష్‌,సుకుమార్‌ లాంటి దర్శకులతో కూడా తదుపరి చిత్రాలతో నటించే యోచనలో ఉండటం... ఇవన్ని మహేష్‌బాబు దూకుడుకు నిదర్శనంగా పేర్కనవచ్చు.ఇవన్నీగాక 10కి పైగా కమర్షియల్‌ యాడ్స్‌ ఉండనే ఉన్నాయి.


నయన అభి...మతం

సినీనటి నయనతార మతం మార్చుకుంది. దర్శకుడు, నటుడు ప్రభుదేవాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆమె తన ప్రియుడి కోసం తన ఇంత కాలం కొనసాగిన క్రైస్తవ మతం వదిలి పెట్టేసింది. ఈ మేరకు.... చెన్నయ్‌లోని ఆర్యసమాజంలో ఆదివారం వేదపండితుల ఆధ్వర్యంలో హిందూమతం స్వీకరించింది. నయన మతం మార్పిడి సంగతి సర్వత్రా చర్చనీయాంశ మైంది.

నయన తార ఈ సంచలన నిర్ణయం వెనక ప్రభుదేవా ఒత్తిడి ఏమైనా పని చేసిందా? లేక నయన తార కావాలని ప్రభుదేవా కోసం మతం మార్చుకుందా? తెలియాల్సి ఉంది. వివాహితుడై ఇద్దరు పిల్లల తండ్రి అయిన ప్రభుదేవా.... భార్యను కాదని నయనతో ప్రేమలో పడటం, కోర్టు వివాదాల అనంతరం చివరకు తన మొదటి భార్య రమలత్‌తో విడాకులు తీసుకోవడం, తను మనసుపడ్డ నయనతారను రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరి వివాహ వేడుకలను మొదట చెనై్నలో తర్వాత హైదరాబాద్‌ అనుకున్నారు. కానీ ఇక్కడ అభిమానుల తాకిడి, తెలిసినవాళ్ల హడావిడి తట్టుకోలేమని ముంబాయ్‌లో నిరాడంబరంగా కేవలం అత్యంత సన్నిహితుల మధ్యనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు ఇద్దరూ. ప్రస్తుతానికి ఇద్దరూ వాళ్ల వాళ్ల సినిమాలలో బిజీ షెడ్యూల్స్‌లో ఉండటంతో వీలుచూసుకుని ఆ వివాహ కార్యక్రమం కూడా పూర్తిచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


ఆ డైరక్టర్ తోనూ ఎన్టీఆర్ కమిటయ్యాడు

ఎప్పటినుంచో అనుకుంటున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ ఖరారు అయినట్లేనని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభానికి చాలా లేటవుతుందని వినపడుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామిడీలో నటించటానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.ప్రస్తుతం ఆ చిత్రానికి సంభందించి త్రివిక్రమ్ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం 'ఊసరవెల్లి' సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ నటిస్తున్నారు. వీటి తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తారు. ఈలోగా త్రివిక్రమ్ కథ సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ నిర్మిస్తారు.

ఇక ఎన్టీఆర్‌తోపాటు త్రివిక్రమ్‌ కూడా రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్‌తో ఆయన ఓ సినిమా రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు. ఈనెలలోనే సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత చరణ్‌తోనూ ఓ సినిమా చేస్తారని తెలిసింది. ఈ సినిమాల తర్వాతే ఎన్టీఆర్‌ సినిమా ఉంటుందా. లేదంటే బన్నీతో సినిమా పూర్తయ్యాక మొదలెడతారా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఖలేజా చిత్రం అనంతరం త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం అల్లు అర్జున్ దే. హనీ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని,నిర్మాత డివివి దానయ్య అని చెప్తున్నారు. లవ్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ మార్కు పంచ్ లు, అల్లు అర్జున్ స్టైల్ యాక్షన్ తో ఈ చిత్రం రూపొందుతుందని చెప్తున్నారు.
Jr Ntr, who is busy with hand full of projects, has signed another film under the direction of writer turned director Trivikram Srinivas it seems and sources say that Jr NTR has given the green signal to Trivikram Srinivas.


రామ్ చరణ్ నాకు క్లాస్ మేట్..క్లోజ్

నేను రామ్ చరణ్ కి బాగా క్లోజ్ అంటున్నారు రానా. మేమిద్దరం ఒకే స్కూల్లో పద్మా శేషాద్రి ..చెన్నైలో చదువుకున్నాం.స్కూల్లో ఒకే డెస్క్ లో కూర్చునే వాళ్ళం. ఇద్దరూ నోట్స్లు మార్చుకునేవాళ్ళం.మేమిద్దరం చాలాకాలంగా స్నేహాన్ని కొనసాగిస్తున్నాం అంటున్నారు రానా.ప్రెండ్షిప్ డే సందర్భంగా మీడియాతో రానా ఇలా స్పందించారు. అలాగే మా స్నేహితులతో నేను చాలా సంతోషంగా గడుపుతాను అంటూ చెప్పుకొచ్చారు.రానా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ చిత్రంలో చేస్తున్నారు.అలాగే ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో రూపొందుతున్న నా ఇష్టం చిత్రం కూడా చేస్తున్నారు.సింహా నిర్మాతలు నిర్మించే ఈ చిత్రం రీసెంట్ గా మలేషియా షెడ్యూల్ పూర్తిచేసుకువచ్చింది.జెనిలియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామిడీ గా రూపొందుతోంది.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నారు.సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.
Rana Speaks about his friendship with Ramcharan as--I am very close to Ram Charan. We studied in the same school, Padma Seshadri, Chennai. So from sharing the same desk at school to swapping notes on our careers, we’ve come a long way.


దడ రేపుతున్న డ్యాన్సులు

మన తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఎన్.టి.ఆర్., అల్లు అర్జున్,.రామ్చరణ్ తేజ్ లు అద్భుతమైన డ్యాన్స్ లతో కుర్రకారును ఉర్రూతలూగిస్తారు. అటు బాలీవుడ్ లో సైతం వీరి డ్యాన్స్లకు మంచి గుర్తింపు ఉంది.

ఇప్పుడు ఫిలింనగర్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం అతి త్వరలో అక్కినేకి కుర్రాడు నాగ చైతన్య కూడా వీరి సరసన చేరనున్నాడు. దడ సినిమాలో చైతు డ్యాన్స్లు అద్భుతంగా చేసాడని వినికిడి.అక్కినేని అభిమానులు ఈ సినిమా విడుదల అనంతరం పండగ చేస్కుంటారు అని చెప్పుకుంటున్నారు.

ఈ గురువారం విడుదలకు సిద్ధం అవుతున్న “దడ” చిత్రం లో చైతన్య సరసన కాజల్ నటిస్తోంది. బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, శ్రీరామ్,కెళ్ళి దోర్జీ, ముకేష్ రుషి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Dhada’s shocking dances


హీరోయిన్స్ ని చూస్తుంటే నా పేరు సార్ధకం ..బాలకృష్ణ

''ఇంతమంది హీరోయిన్స్ అందరూ కలసి నాకు అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. నా పేరు సార్థకం చేసుకొన్నాను అనిపిస్తోంది అన్నారు నందమూరి బాలకృష్ణ. రీసెంట్ గా ఆయన 'సింహా' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా 'సంతోషం' అవార్డును అందుకొన్నారు. వేదిక మీద ఉన్న హీరోయిన్స్ అంతా బాలకృష్ణకు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా స్పందించారు.అదే వేదికపై మాట్లాడుతూ.. ''ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగానే సినిమాలు తీయాలి. ఇప్పుడు నటులంటే నిత్యావసర వస్తువుల్లాంటివాళ్లు. సినిమా అంటే జనం జీవితంలో భాగం అయిపోయింది. వాళ్లకు ఏయే విషయాలు నచ్చుతాయో వాటిని మేళవిస్తే విజయం అందుతుంద అన్నారు. అలాగే 'సింహా' చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీను అన్నీ తానై నడిపించాడు'' అని మెచ్చుకున్నారు.ఇక ఇదే వేదికపై ఉత్తమ నటిగా అనుష్క (వేదం) అవార్డు అందుకుంది. దర్శకుడు బాపు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును అందుకొన్నారు.
Santosham Awards: Nandamuri Balakrishna was awarded Best Actor award for Simha movie while Boyapati Srinu was felicitated with Best Director


బ్యాంకాక్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న రచ్చ

చిరు తనయుడు చరణ్, తమన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో..మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్ బి చౌదరి సమర్పణలో నిర్మాతలు పరాస్ జైన్మ, ఎన్ వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రచ్చ. గతంలో శ్రీలంకలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈనెల 15 వరకు అక్కడ షూటింగ్ జరుపుకుని అనంతరం చైనాలో మరో షెడ్యూల్ జరుపుకోనుంది.

చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ సంపత్ నంది కధ ఏ రేంజ్ లో చెప్పాడో అదే రేంజ్ లో తీస్తున్నాడు. చిత్రానికి మరో హై లైట్ పరుచూరి బ్రదర్స్ రచన. రచ్చ చిత్రం మెగా అభిమానుల అంచనాలని అందుకునే రీతిలో ఉంటుందన్నారు. చిరుతో పలు విజయవంతమైన చిత్రాలలో పనిచేసిన పరుచూరి బ్రదర్స్ ఇప్పుడు రామ్ చరణ్ ని మరో విభిన్న కోణంలో చూపించబోతున్నారని అన్నారు. రచ్చ చిత్రాన్ని ఈ సంవత్సరంలోనే విడుదల చేస్తాం అని తెలిపారు.
Racha Movie shooting schedule in Bangkok


చరణ్ వివాహం ఖరార్!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ వివాహం నిశ్చయం అయింది. తన చిన్ననాటి స్నేహితురాలైన ఉపాసన కామినేని తో వివాహానికి పెద్దలు ఒప్పుకున్నారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప రెడ్డి గారి మనుమరాలు.
వీరి ప్రేమ విషయం గత రెండు సంవత్సరాలుగా ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయినప్పటికీ, ఇరువర్గాల లో ఎవరి నుండి ఎటువంటి ధృవీకరణ లేదు. అయితే ఇప్పుడు మాత్రం చిరంజీవి వీరి పెళ్ళికి ఒప్పుకునట్టుగా అయన సన్నిహితులు చెప్పటంతో ఈ ప్రేమ జంట పెళ్ళికి సిధం అయిందని చెప్పవచ్చు.
రామ్ చరణ్ ఉపాసనలకు మా అభినందనలు
Mega Power Star Ram Charan is likely to tie knot this yearend.

With the Mega family visiting Prathap Reddy’s (Chairman of Apollo hospitals) family a few days ago, the buzz about engagement between Upasana Kamineni and Ram Charan is spreading like a wild fire. Upasana is granddaughter of Prathap Reddy. She is the Vice President of Apollo Philanthropy & Editor of BPositive magazine.

A reliable source said that Mega Family and Reddy’s family discussed about the nuptials which is expected this yearend.

The source added that Ram Charan wanted to wait for two more years but it is his father who insisted saying that it is the right time for Ram Charan to marry.

Soon after Allu Arjun's marriage to Sneha Reddy, rumors were rife that Chiranjeevi would take the cue and finally agree to Cherry marrying his childhood friend Upasana, the granddaughter of Dr Prathap C Reddy, founder-chairman, Apollo Hospitals. Seems like Chiranjeevi has yielded to the young star's wishes.


1   2


Tags: Telugu Movie Review, News, Songs, Gossips, Heroes, Heroines, Hot Pictures, New Release Movies, Old Movies, Online Tickets, Movies in Halls, Gold Rate, Colleges List, Schools list, Cabs, Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011