వజ్రాల మూట(06/07/2011)ఒకసారి వివేకవర్మ వుహారాజు దగ్గరకు ఒక వ్యక్తి న్యాయుం కోసం వచ్చాడు. అతడు వుహారాజుకు వందనం చేసి, ‘‘వుహారాజా! నా పేరు గోపాలుడు. వూ యజమాని పేరు నీలంకంఠుడు. ఆయన నాకు వజ్రాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. మీరే నాకు న్యాయుం చేయూలి’’ అని వేడుకున్నాడు. కాకి - గేదె (06/07/2011)అది వేసవికాలం. ఎండలు విపరీతంగా మండుతున్నారుు. ఓ చెట్టు నీడలో ఒక గేదె సేదతీరుతోంది. అది తన కళ్లను సగం వుూసుకొని, ఆహారాన్ని నెవురువేస్తోంది. ఇంతలో ఆ చెట్టు మీద ఒక కాకి వాలింది. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల చెట్టు మీద కూడా కాస్త వేడిగానే ఉంది. చెట్టు కింద చల్లగా ఉందని ఆ కాకి నేల మీద వాలింది. వురీ నేల మీద ఎందుకులే అని, అక్కడ నుండి ఎగిరి గేదె కొవుు్మల మీద వాలింది. ఆ గేదె కాకిని అసలు పట్టించుకోకుండా అలానే కూర్చుంది. కాకి అలా ఆ గేదె కొవుు్మల మీద కాసేపు సేదతీరింది. ఇక ఎగిరి వెళదావునుకున్న సమయంలో, కాకి తన వునసులో ఇలా అనుకుంది. దురాశకు పోతే దుఃఖం (02/07/2011)ఒకసారి ఒక సాధు పుంగవుడు తన శిష్యులందరి పట్ల సంతుష్టుడై ‘మీకు అమోఘమైన ఒక మంత్రం ఉపదేశిస్తాను. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని జీవితాన్ని సంతోషంగా గడపండి’ అని ఒక మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని చదివి మీకేం కావాలంటే అది కోరుకోండి అది జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే. దీన్ని దుర్వినియోగం చేయకండి’‘ అని చెప్పాడు. ఆ శిష్యులలో ఆశారాం అనేవాడు అసంతృప్తితో ‘స్వామీ ఇంతకాలంనుంచి మిమ్ము సేవించుకున్నాను. ఒక్క మంత్రమేనా ఉపదేశించేది?’ రెండింటిని కోరుకునేలా నాకు ఇంకో మంత్రం ఉపదేశించండి’ అని అడిగాడు. అందరు శిష్యులు ఇచ్చినదానితో తృప్తి పడితే వీనికి ఆశ ఎక్కువగా ఉంది అనుకుని ఆ సాధువు ‘అందరికీ సమానంగా మంత్రం ఉపదేశించా, నీకు ఆశ పనికిరాదు, దొరికిన దానితో తృప్తిపడాలి’ అని హితవు చెప్పాడు. కానీ ఆశారాం వినకుండా తనకు ఇంకో మంత్రం ఉపదేశించాల్సిందే అని పట్టుపట్టాడు. సమయస్ఫూర్తి (02/07/2011)విదర్భపురాన్ని జయేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు ఆ రాజు నిద్రిస్తున్న సమయంలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో అతని నోటి పళ్ళన్నీ ఊడిపోయి, ఒక పన్ను మాత్రమే మిగిలింది. మెలకువ వచ్చిన జయేంద్రుడు ఆ కలకు అర్థం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. మరునాడు కలలకు అర్థం చెప్పగలిగే జ్యోతిష్యులను పిలిపించమని సభలో మంత్రు లను ఆదేశించాడు. బీర్బల్ తెలివి (02/07/2011)ఒకరోజు అక్బరు చక్రవర్తి, మంత్రి బీర్బల్ పచ్చికబయళ్లలో నడుస్తున్నారు. అక్కడ ఒక గొర్రెలకాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండటం గమనించాడు. సీతాకోకచిలుక గర్వం (02/07/2011)ఒక గులాబి తోటలో ఒక సీతాకోక చిలుక ఉండేది. అది రంగురంగుల రెక్కలతో చూడటానికి ఎంతో అందంగా ఉండేది. తన అందం పట్ల దానికి ఎంతో గర్వం, ఆ గర్వంతో పాటు కొంచెం మూర్ఖత్వం కూడా ఉండేది. యోగ్యత (29/06/2011)వంతీపురాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజు మంచి సమర్థుడు. యోగ్యుడు. ప్రజలను తన కన్నబిడ్డల్లా ఎలాంటి కష్టనష్టాలు ఈతిబాధలు లేకుండా ప్రజానురంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. అతని పరిపాలనను ప్రజలు రామరాజ్యంగా కొనియాడుతూ ఉండేవారు. అయితే మహారాజుకు ఒక్కగానొక్క కూతురు అవంతిక. ఆమె సౌందర్యవతిగానే కాక విద్యా వినయ సంపన్నురాలిగా పేరు తెచ్చుకుంది. మహారాజుకు పురుష సంతానం లేదు. కాబోయే అల్లునికి రాజ్యాన్ని అప్పగించి వారసునిగా ప్రకటించాలని మహారాజు ఆలోచన. అయితే అందుకు తగిన అర్హతలుకల వ్యక్తి ఎవరు అనేది ప్రశ్న. అందుకు అనేకమంది రాజకుమారులు పోటీలో ఉన్నారు. మహారాజు అనుమతిస్తే లేదా స్వయంవరం ప్రకటిస్తే రాజ్యలక్ష్మిని, రాకుమారిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అన్ని యోగ్యతలుకల వ్యక్తిని రాజుగా నియమించాలని, అయితే అతను సాధారణ పౌరుడైనా పర్వాలేదని అనేది మహారాజు ఆలోచన. అందుకోసం దేశాటనం చేసి తగిన వ్యక్తిని నిర్ణయించాలని రాజ్యాన్ని మంత్రికి అప్పగించి గుర్రంపై ఒంటరిగా బయలుదేరాడు. మహారాజు వేషంలో ఉంటే ఎవరెలాంటివారో బయటపడకపోవచ్చని మారువేషంలో బయలుదేరాడు. ఆలోచనా సరళి (29/06/2011)కాశీనాథ్ అనే పేద యువకుడు ఒకసారి అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అతను విష్ణుభక్తుడు. అతనికి మార్గమధ్యంలో ఒక సాధువు కలిశాడు. వ్యాపార వారసుడు (29/06/2011)ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. ఆ వర్తకుడికి ముగ్గురు కొడుకులు. తనకు వయసు మీద పడుతుండడంతో తన వ్యాపారలావాదేవీలను కొడుకులకు అప్పగించాలి అనుకున్నాడు వర్తకుడు. తన కొడుకులలో అందుకు సమర్థుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. షవర్ బాత్ స్నేహితులు (22/06/2011)ఒక అడవిలో ఒక ఏగునుల గుంపు ఉండేది. ఆ గుంపులో నిక్కి అనే ఒక ఏనుగు పిల్ల ఉండేది. ఆ గుంపులో అదొక్కటే పిల్ల ఏనుగు కావడంతో దానికి ఆడుకోవడానికి స్నేహితులు ఉండేవి కాదు. అది పేరుకు పిల్ల ఏనుగే కానీ ఆ అడవిలో ఉండే మిగతా అన్ని జంతువుల కంటే ఎత్తుగా, లావుగా ఉండేది. నిక్కికి స్నేహితులు లేకపోవడంతో ఒంటరితనంతో బాధపడేది. ఒకరోజు దానికి ఆ అడవిలో ఉన్న మిగతా జంతువుల పిల్లలు ఆడుకోవడం కనిపించింది. వెంటనే వాటి దగ్గరకు వెళ్లింది. ఉత్తమ శిష్యుడు (21/06/2011)రాఘవేంద్రస్వాములు ఒక ఆశ్రమ పాఠశాలను నడిపేవారు. అందులో ఎంతోమంది విద్యార్థులు చిన్నతనంలోనే చేరి యుక్తవయసు వచ్చేసరికి మంచి విజ్ఞానవంతులై తిరిగి వెళ్ళేవారు. వారిలో విశ్వనాథుడు, శ్రీనివాసుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు. అన్ని విద్యల్లోనూ ఇద్దరూ సమానమైన ప్రతిభ కనబరిచేవారు. స్వాముల వారికి ఆ ఇద్దరంటే చాలా ఇష్టం. తన తరువాత ఆ ఆశ్రమపీఠాన్ని వారిలో ఒకరికి ఇవ్వాలనుకున్నారు. అయితే ఎవరు దానికి అర్హులో తెలుసుకోవడానికి చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు. |