Telugu Stories    Contract All | Expand All

ఆలోచనా మేఘం(29/07/2011)

అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూర్లో కొండ పైన ఒక పెద్ద మేఘం ఉండేది. ‘‘ఈ మేఘం కురవడం వల్లనే కొండ పక్కనున్న చెరువు నిండుతోంది. అక్కడున్న మన పొలాలన్నీ చక్కగా పండుతున్నాయి’’ అని ఆ మేఘాన్ని ఆ ఊరి రైతులు మెచ్చుకునే వాళ్లు.

ఒకసారి ఆ మేఘానికి దాని కన్నా కాస్త పెద్దగా ఉన్న మరో మేఘం కనిపించింది. దానితో అది దిగులు పడింది. ‘‘నేను దాని కన్నా పెద్దగా ఉండాలి. లేకపోతే నన్నెవరూ మెచ్చుకోరు’’ అనుకుంది.

‘‘నేను కురిస్తే దాని కన్నా చిన్నగా అయిపోతానేమో’’ అనుకొని వర్షించకుండా ఉండడం మొదలు పెట్టింది. అయితే ఆ మేఘం ఆశించినట్లుగా అది చూసిన మరో మేఘం కన్నా పెద్దగా కాలేదు.

కొండ దగ్గర వర్షం కురవక పోవడంతో చెరువులో నీళ్లు తగ్గిపోయాయి. పొలాల్లో సరిగా పంటలు పండడంలేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడసాగారు. వర్షం కురవడం లేదని మేఘాన్ని తిట్టడం మొదలు పెట్టారు. కొన్నిరోజులకి నెమ్మదిగా చెరువు కూడా ఎండిపోయింది. దానితో మేఘానికి కావాల్సిన నీటి ఆవిరి అందక అది గతంలో కన్నా చిన్నగా, తేలికగా అయిపోయింది.

గాలివాటుకి పక్క ఊరి వైపు కొట్టుకు పొయింది. అక్కడ చెరువుల నిండా నీళ్లు ఉండడంతో మేఘానికి కావాల్సిన నీటి ఆవిరి దొరికింది. తిరిగి తనుండే కొండ వైపు వచ్చింది. దానితో అక్కడ గతంలోలాగా వర్షాలు కురిసాయి. ప్రజల ఇబ్బందులు తగ్గాయి.

అప్పుడు ఆ మేఘానికి తాను అంతకు ముందు చేసిన తప్పు ఏమిటో అర్ధమయింది. ఆకారం పెద్దదా, చిన్నదా అనేది ముఖ్యం కాదని అనుకుంది. వర్షాలు కురిస్తేనే తనకీ, ప్రజలకీ మనుగడ ఉంటుందనీ, లేకపోతే ప్రజలతో పాటుగా తనకీ కష్టాలు తప్పవనీ గ్ర హించింది. అప్పటి నుంచి తన ఆకారం గురించి పట్టించుకోకుండా తను చేయాల్సిన పని మీదే శ్రద్ధ పెట్టింది. దానితో మేఘంతో పాటు ఆ ఊరి ప్రజలు కూడా సంతోషంగా ఉండసాగారు.


సంతోషమైన ముఖం (29/07/2011)

అనగనగా ఒక ఊరిలో సంతోష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతడు ఒకరోజు ఆడుకుంటూ వాళ్ల ఇంట్లో పాత సామాన్లు ఉన్న గదిలోకి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక అద్దం కనిపించింది. నగిషీలు చెక్కి ఉన్న చెక్క ఫ్రేమ్‌లో ఆ గుండ్రటి అద్దం సంతోష్‌కి బాగా నచ్చింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి తల్లికి చూపించి, ‘అమ్మా! నేను ఈ అద్దాన్ని తీసుకుంటాను’ అని చెప్పాడు. తల్లి ‘‘సరే నాయనా! కాని జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది మన పూర్వీకులది. పాడు చేయకూడదు ’’ అని చెప్పింది. సరేనన్నాడు సంతోష్.

ఆ అద్దాన్ని తీసుకున్న సంతోష్ దాన్ని శుభ్రంగా తుడిచి అందులో ముఖం చూసుకున్నాడు, అతని ముఖం దిగులుగా కనిపించింది. ‘అదేంటి నా ముఖం ఎందుకు దిగులుగా ఉందబ్బా అనుకున్నాడు. తన ఆట వస్తువుల్ని తీసుకుని ఆడుకున్న తర్వాత మళ్లీ అద్దంలో చూసుకున్నాడు. అప్పుడు కూడా ముఖంలో దిగులు కనిపించింది. కాసేపటి తర్వాత తనకి ఇష్టమైన తిండి తిన్నాడు. తిన్న తర్వాత అద్దంలో ముఖం చూసుకున్నా ముందులాగే కనిపించింది.

‘ఛీ! ఈ అద్దంలో ముఖం చూసుకోకూడదు’ అని తనను తను తిట్టుకున్నాడు సంతోష్,
ఆ రోజు సాయంత్రం తల్లికి చెప్పి పార్కులో ఆడుకోవటానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటుండగా సంతోష్‌కి ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు, ఆ బాబు పక్కన పెద్దవాళ్లు ఎవరూ లేరు. బాబు తప్పిపోయాడని గ్రహించాడు సంతోష్. తన దగ్గర ఉన్న డబ్బులతో బాబుకి వేరుశనగకాయలు కొని వాటిని ఒలిచి తినిపించాడు. మంచినీళ్లు కూడా తాగించాడు, అప్పుడు ఆ చిన్న బాబు ఏడవటం ఆపాడు. బాబుని ఆడిస్తూ తల్లిదండ్రుల కోసం వెతకసాగాడు. ఈలోగా బాబు తల్లిదండ్రులు కనిపించారు. బాబుని చూసి చాలా సంతోషించారు. బాబుని జాగ్రత్తగా చూసుకున్నందుకు సంతోష్‌ని మెచ్చుకున్నారు.

తమ ఇంటికి ఎప్పుడైనా రావచ్చని ఆహ్వానించారు. ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని తల్లికి చెప్పాడు సంతోష్, తల్లి కూడా సంతోషించింది. అప్పుడు అద్దం గుర్తుకు వచ్చి అద్దంలో ముఖం చూసుకున్నాడు. ముఖం అద్దంలో వెలిగిపోతూ కనిపించింది.
నీతి: ఇతరులకు సహాయం చేయటం భగ వంతుడిని పూజించటంతో సమానం. అప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయమైనది


స్నేహంతో వ్యాపారం(18/07/2011)

అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు, చేపలు, పళ్లు, కీటకాలు సేకరించి వ్యాపారం చేసేది. సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరాన ఉండే పక్షులు కూడా కొంగ దగ్గరే ఖరీదు చేసేవి. దాంతో అక్కడికి వచ్చిన పక్షులను ప్రేమతో పలకరించేది కొంగ. అలా వ్యాపారపరంగా చాలా పక్షులు కొంగకు స్నేహితులయ్యాయి. దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది.
అదే అడవిలో ఓ కాకి ఉండేది. అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు కొంగ దగ్గరే ఖరీదు చేసేది. కాకికి ఆ అడవి నిండా స్నేహితులే ఉన్నాయి. తను కూడా కొంగలా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంది. కాకికి కొంగ వ్యాపారం చూసి అసూయ కలిగింది. తనకున్న స్నేహితులనే పావులుగా వాడి కొంగ వ్యాపారాన్ని దెబ్బ తీయాలనుకుంది.
కాకి అడవిలో అంగడి తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది. కొంగ అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవిమధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై తనవద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది.
కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులైన కోడిపుంజు, బాతు, చిలక, నెమలి, గద్ద, పావురం...ఇలా పక్షులన్నీ రావడం మొదలుపెట్టాయి. పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో కొంగ వ్యాపారం తగ్గిపోయింది.
కోడిపుంజు చేతిలో పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది.
‘కాకి బావా! కాకిబావా! నాకు కిలో గోధుమలు, కిలో వడ్లు, అరకిలో చేపలు, పావుకిలో పురుగులు కావాలి!’ అంది కోడిపుంజు.
కోడిపుంజు కోరినవన్నీ కాకి కొలిచి ఇచ్చింది. కాకి ప్రతిఫలంగా డబ్బు అడిగింది.
‘ఇస్తాలే కాకిబావా! ఎక్కడికి పోతా!’ అంది కోడిపుంజు. స్నేహం కొద్దీ కాకి సరేనంది.
అది వెళ్లిందో లేదో చేతిలో సంచీతో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది. చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది.
‘‘కాకి బావా! కాకిబావా! నాకు జామపళ్లు, రేగిపళ్లు, పెసరగింజలు కావాలి!’’ అంది చిలకమ్మ.
కాకి అందించింది. కాకి ప్రతిఫలంగా డబ్బు అడిగింది.
‘‘తీసుకుందువులే! మళ్లీ రానా...ఏంటీ!’‘ అంది చిలకమ్మ. స్నేహంకొద్దీ కాకి అలాగేనంది.
అది వెళ్లిందో లేదో చేతిలో సంచితో గద్ద వాలింది. గద్ద రాకకు కాకి పొంగిపోయింది.
‘‘అన్నా! రా అన్నా!’’ అని ప్రేమతో పిలిచింది కాకి.
‘‘కాకి తమ్మి! నాకు చేపలు కావాలి!’’ అంది హుందాగా! కాకి గబగబా సంచీనిండా చేపలు నింపి ఇచ్చింది. కాకి ప్రతిఫలంగా డబ్బు అడిగింది.
‘‘డబ్బులా!సరే, తర్వాత చూద్దాం తమీ!’’ అంటూ సంచీతో రివ్వున పైకెగిరిపోయింది గద్ద.
ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కానీ పైసా తిరిగి రాలేదు. గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది. కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది.
కొంగ వ్యాపారం మీద వున్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి. అంతేకాదు స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని కొంగలా వ్యాపారపరంగా ఏర్పరచుకున్న స్నేహమే గొప్పదని తెలుసుకుంది కాకి. స్నేహానికి, వ్యాపారానికి ముడిపడదని గ్రహించిన కాకి మరునాడు చేతిలో సంచితో, జేబులో డబ్బుతో కొంగ అంగడివైపు అడుగులేసింది.


స్ఫూర్తి(18/07/2011)

చాలాకాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పాలించేవాడు. ధైర్యసాహసాలుగల విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యం కన్నులపండువుగా సంపదలతో తులతూగుతూ ఉండేది.

మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగుదేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుడి దగ్గర ఎక్కువమంది సైనికులు లేరు. అందువల్ల విక్రమసేనుడు యుద్ధంలో పరాజయం పొందాడు. ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి, ఒక కొండగుహలో దాక్కున్నాడు.

ఒంటరితనం, పరాజయం, బాధ, అలసట.. అన్నీ ఒక్కసారిగా విక్రమసేనుడిని ఆవరించాయి. ‘‘కన్నబిడ్డల్లాంటి ప్రజలను, రాజ్యాన్నీ కోల్పోయిన నేను ఇక బ్రతకటం అనవసరం. నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి?’’ అని ఆలోచించిన విక్రమసేనుడు, ‘తనకు చావే శరణ్యం’అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకుంటే బావుంటుందని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటబడింది.

ఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నిస్తోంది. సాలీడు పైకి పాకే కొద్దీ దాని నుండి వచ్చే దారం తెగిపోతోంది. దాంతో సాలీడు కిందికి జారిపోతోంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నోసార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా ఎగబాకి గూడును అల్లటం పూర్తి చేయగలిగింది.

అది చూసిన విక్రమసేనుడిలో కొత్త ఆలోచన కలిగింది. ‘ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరించక మళ్ళీమళ్ళీ ప్రయత్నించి, అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు. నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. వైఫల్యం వస్తున్నప్పుడే గెలవడానికి ఒక నిచ్చెన కూడా వస్తుంది.’ ఈ రకమైన ఆలోచన కలిగిన విక్రమసేనుడిలో నిరాశ, నిస్పృహలు పటాపంచలైపోయాయి. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది.

విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి, చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు.

నీతి: గెలుపు లభించేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి.


శత్రువైరం (18/07/2011)

పూర్వం ఒక పండితుడి ఇంట్లో పాడి ఆవు ఉండేది. ఒక దొంగ కన్ను ఆ ఆవుమీద పడింది. ఎలాగైనా దానిని దొంగలించాలనుకుని ఒక రాత్రి ఆ ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. దొంగ ఆ రాక్షసునితో ‘‘అయ్యా! నమస్కారం, మీరిక్కడికి ఎందుకు వచ్చినట్లు?’’ అని అడిగాడు.

‘‘ఈ పండితుడిని మింగడానికి. మరి నీవెందుకు వచ్చావు?’’ అడిగాడు బ్రహ్మరాక్షసుడు.
దొంగ, ‘‘ఆవు కోసం’’అని చెప్పి, ‘‘నాకు ఆవు, నీకు పండితుడు కావాలి, కాబట్టి మనం గొడవ పడకుండా ఎవరి పని వాళ్లు చేసుకుందాం’’ అన్నాడు.

‘‘సరే కానీ నేను బ్రాహ్మణుడిని తిని వెళ్ళే వరకు నువ్వు ఓపిక పట్టాలి. ముందుగానే నీవు ఆవు దగ్గరకు వెళ్తే అది నిన్ను చూసి అరుస్తుంది, ఆ అరుపులకు అందరూ మేల్కొంటారు. అప్పుడు నా పని కష్టమవుతుంది. కాబట్టి నా పని ముందు జరగాలి. పైగా నీకన్నా నేను బలవంతుడిని కూడా. కాబట్టి నా నాయకత్వాన్ని నీవు అంగీకరించాలి’’ అన్నాడు రాక్షసుడు.

దొంగ అందుకు ఒప్పుకోలేదు. ‘‘నీవు పట్టుకోగానే పండితుడు అరుపులు, పెడబొబ్బలు పెడతాడు. ఇరుగుపొరుగు పోగైతే నేను ఒట్టి చేతులతో వెళ్ళాల్సి ఉంటుంది. నీవు బలవంతుడివి, పండితుడిని ఎలాగైనా తినగలుగుతావు, నాయకుడు ముందు అనుచరులకు మేలు కలిగేలా చూడాలి, కాబట్టి నేను ఆవును తోలుకెళ్ళే వరకు నీవు ఆగాలి’’ అన్నాడు.

ఇద్దదూ నేనంటే నేను ముందు అని వాదులాడుకుంటూ పెద్దగా అరుచుకున్నారు. దాంతో పండితుడికి మెలకువ వచ్చింది.

దొంగ వెంటనే తాను దొంగతనానికి వచ్చిన సంగతి కూడా మరిచిపోయి, ‘‘ఓయ్! పండితుడా! ఈ రాక్షసుడు నిన్ను తినడానికి వచ్చాడు’’ అని అరిచాడు. రాక్షసుడు కూడా ‘‘వీడు దొంగ, నీ ఆవును దొంగలించడానికి వచ్చాడు’’ అని చెప్పేసాడు.

పండితుడికి విషయం అర్థమైంది. అందరికీ వినబడేలా ‘ఆంజనేయదండకం’ చదవడం ప్రారంభించాడు. ఆంజనేయుడి పేరు వినగానే బ్రహ్మరాక్షసుడు హడలి పారిపోయాడు. ఇంటిల్లిపాదీ, ఇరుగుపొరుగువాళ్ళు లేవడం చూసి దొంగ కూడా కాళ్ళకు బుద్ధి చెప్పాడు.

నీతి : మన శత్రువుల మధ్య వైరం మనకు ఉపకరిస్తుంది.


దురాశకు పోతే దుఃఖం(11/07/2011)

ఒకసారి ఒక సాధు పుంగవుడు తన శిష్యులందరి పట్ల సంతుష్టుడై ‘మీకు అమోఘమైన ఒక మంత్రం ఉపదేశిస్తాను. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని జీవితాన్ని సంతోషంగా గడపండి’ అని ఒక మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని చదివి మీకేం కావాలంటే అది కోరుకోండి అది జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే. దీన్ని దుర్వినియోగం చేయకండి’‘ అని చెప్పాడు. ఆ శిష్యులలో ఆశారాం అనేవాడు అసంతృప్తితో ‘స్వామీ ఇంతకాలంనుంచి మిమ్ము సేవించుకున్నాను. ఒక్క మంత్రమేనా ఉపదేశించేది?’ రెండింటిని కోరుకునేలా నాకు ఇంకో మంత్రం ఉపదేశించండి’ అని అడిగాడు. అందరు శిష్యులు ఇచ్చినదానితో తృప్తి పడితే వీనికి ఆశ ఎక్కువగా ఉంది అనుకుని ఆ సాధువు ‘అందరికీ సమానంగా మంత్రం ఉపదేశించా, నీకు ఆశ పనికిరాదు, దొరికిన దానితో తృప్తిపడాలి’ అని హితవు చెప్పాడు. కానీ ఆశారాం వినకుండా తనకు ఇంకో మంత్రం ఉపదేశించాల్సిందే అని పట్టుపట్టాడు.
దానికా సాధువు సరేనని కోరుకున్నది జరిగేట్టు ఇంకో మంత్రం ఉపదేశించి పంపాడు. ఇంటికి వెళ్లాక ఆశారాం ‘నా ఇల్లేమిటి ఇలా దరిద్రంగా ఉంది..వట్టి మట్టికొంప, దీన్ని బంగారు ఇల్లుగా మార్చుకుంటే ఎంత బాగుంటుందో’ అనే ఆలోచన వచ్చి సాధువుచెప్పిన మొదటి మంత్రం చదివి ‘నా ఇల్లు బంగారంగాను’ (బంగారు ఇల్లు అవ్వాలని) కోరుకున్నాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు! ఇంట్లో వస్తువులతో సహా ఇల్లంతా బంగారమై మెరిసిపోతోంది. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇప్పుడు తానెంతో ధనవంతుడనని, తనకెవరూ సాటిరారని గర్వపడ్డాడు...‘ ఇలా బంగారపు ఇంట్లో బంగారు వస్తువులతో జనం మధ్యలో వుంటే అందరి కళ్లూ నామీదే ఉంటాయి. దాంతో దొంగలు దోపిడీదారులు నా ఇంటిపై కనే్నస్తారు..ఇదంతా అపహరించుకోవడానికి’ అనే భయం పట్టుకుంది. ఏం చెయ్యాలా?’ అని ఆలోచిస్తుంటే సాధువుగారు ఉపదేశించిన రెండో మంత్రముందిగా నా దగ్గర అనుకుని ఆ మంత్రం పఠించి ‘నా బంగారం నాకే కాక ఇతరులకు కనపడకుండుగాక’ అని కోరుకున్నాడు. ఇప్పడు ఆ బంగారు ఇల్లు, అందులో వస్తువులు ఆశారాంకు తప్ప ఇతరులకెవ్వరికీ కనపడడంలేదు. చుట్టుపక్కలవాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఆశ్చర్యపడుతున్నారు. ఆశారాం కనపడుతున్నాడు, కానీ ఇల్లేమైంది. వట్టి ఖాళీ జాగాలో ఉంటున్నాడేమిటో?’అని!
ఒకరోజు ఆశారాం తనవద్దనున్న బంగారంలో కొంత అమ్మాలనుకున్నాడు. రోజువారీ ఖర్చులకోసం డబ్బు కావాలి కదా! కొంత బంగారం పట్టుకుని బంగారం వ్యాపారి దగ్గరకు వెళ్లాడు ఆశారాం. తను కోరుకున్న రెండో వరం..తన బంగారం తనకేగానీ ఇతరుల కంటికి కనపడకుండా వుండాలన్నది మరిచిపోయాడు. వ్యాపారి వద్దకు పోయి ‘ఈ బంగారానికి ధరకట్టి డబ్బులియ్యండి’ అని బంగారం చూపించాడు. ఆ బంగారం తనకే గానీ వాళ్లకు కనపడదు కదా! దానికా వ్యాపారి ‘‘ఏమీ ఇవ్వకుండా బంగారం తీసుకుని డబ్బియ్యమంటావేమిటి? ననే్న మోసం చేద్దామనుకుంటున్నావా?’’ అని కేకలేశాడు. దాంతో ఆశారాం పక్కనున్న వారిని ‘‘చూడండయ్యా, నేను బంగారం ఇస్తుంటే ఏమీ లేదంటున్నాడీయన, ఇదేంటి, ఇది బంగారం కాదా? చూడండి’’ అంటూ చేతిలోని బంగారం చూపిస్తున్నాడు అందరికీ. ఆ బంగారం అతనికి తప్ప ఎవరికీ కనపడడంలేదు. అందుకని అందరూ ‘‘ పోవయ్యా వట్టి చేతులు చూపిస్తూ బంగారం ఉందంటున్నావు అందరికీ చెవిలో పువ్వులు పెడతావా? ఏది బంగారం! నీకేమన్నా పిచ్చా’’ అని ఆశారాం మాటలు ఎవరూ నమ్మలేదు. పైగా ‘పిచ్చివాడు’ అని అందరూ నవ్వడం మొదలుపెట్టి, పోరా పోరా పిచ్చోడా! అంటూ తన్ని తరిమివేశారు. పాపం! ఆశారాం ఆశపడి ఇంటిని బంగారం చేసుకున్నాడు. కానీ దురాశ అతడిని అన్నింటికీ దూరం చేసి పిచ్చివానిగా ముద్రవేసింది. ఇంటికే కాదు ఊరికీ దూరమయ్యాడు!
చూశారా! తృప్తిలో వున్నంత సుఖం ఎందులోనూ ఉండదు. ఆశ ఉండచ్చు. కానీ తగిన మోతాదులో ఉండాలి . మోతాదు మించి మొత్తానికే మోసం దుఃఖానే్న మిగుల్చుతుంది.


సరియైన న్యాయం(11/07/2011)

పూర్వం అవంతి రాజ్యాన్ని సునందుడనే రాజు పరిపాలించేవాడు. రాజ్యంలో సుఖశాంతులు నిండుగా ఉన్నాయి. సకాలానికి వర్షాలు పడి పంటలు బాగా పండుతున్నాయి. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. న్యాయం నాలుగు పాదాల నడుస్తుంది. దానికి ముఖ్య కారణం ధర్మపాలుడనే న్యాయాధికారి కొలువులో పనిచెయ్యడమే.సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించేవాడు. అందువల్ల రాజన్నా, న్యాయాధికారి ధర్మపాలుడన్నా ప్రజలకు ఎంతో ఇష్టం.
సునంద మహారాజుకి ప్రకృతంటే చాలా ప్రేమ. ప్రకృతిలో దాగిన అందాల్ని చూడడమంటే ఎంతో సరదా.అప్పుడప్పుడు వేటకు తోటకు వెడుతుండేవాడు. తనతోపాటు ఒకోసారి న్యాయాధికారిని కూడా తోడుగా తీసుకువెడుతుండేవాడు. వారిద్దరి మధ్య అభిమానం,ప్రేమ నిండుగా ఉన్నాయి. ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవడానికి రాత్రిళ్లు మారువేషాలతో రాజ్యంలో తిరుగుతుంటారు.
ఒకరోజు ప్రశాంత వాతావరణంలో రాజుగారికి ప్రకృతి సౌందర్యం చూడాలని న్యాయాధికారిని తోడుగా తీసుకుని నగరం వెలుపలకి వెళ్లాడు. ప్రకృతి అందాలను చూస్తూ చాలా దూరం నడిచాడు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని దగ్గరలో వున్న చెట్టునీడకు వెళ్ళారిద్దరూ. కూర్చుని పరిసరాల్ని నిశితంగా చూస్తున్నారు. చెట్టుకు దగ్గరలో తళతళ మెరుస్తూ ఒకటి కనపడింది. వెళ్లి తీసుకురమ్మని చెప్పాడు. ఇది వెండి ఉంగరం ప్రభూ! రాయిమాత్రం ఖరీదు కలిగింది. ఎవరిదో పేదవాడిదై ఉంటుంది. ఇక్కడ కాసేపు విశ్రమించినట్టు గుర్తులు కూడా ఉన్నాయని న్యాయాధికారి అన్నాడు.
పాపం ఎంతో కష్టపడి దీన్ని తయారు చేయించుకుని ఉంటాడు. దీనిని పోగొట్టుకున్నవాడికే చేర్చాలి అని రాజన్నాడు. అవును ప్రభు అని న్యాయాధికారి అన్నాడు.రేపే ఉంగరం పోయిందని, పోగొట్టుకున్న వాళ్లు వచ్చి తీసుకోవచ్చని దండోరా వేయిద్దామని రాజు అన్నాడు. దండోరా వింటే పోగొట్టుకున్నది నేను, నేనని ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు ప్రభూ! వాళ్లలో నిజంగా పోగొట్టుకున్న వాళ్ళెవరో గుర్తించడం చాలా కష్టం అని న్యాయాధికారి అన్నాడు. అయితే దీని ఆనవాళ్లు చెప్పిన వాళ్లకు ఇద్దామన్నాడు రాజు. అలా కూడా కష్టం ప్రభూ. ఈ చెట్టుకింద అయిదారుగురు కలిసి విశ్రమించిన దాఖలాలున్నాయి. ఉంగరాన్ని పోగొట్టుకున్న వాడితో వున్న మిగతావాళ్లు తప్పకుండా చూసిఉంటారు. వాళ్లలో ఎవరికైనా దుర్భుద్ధి పుట్టి ఉంగరం నాదంటే నాదని ఆనవాళ్లు చెబితే న్యాయం జరగదు. నిజంగా వస్తువు పోగొట్టుకున్న వాళ్లకు వస్తువు దక్కదు. దీనిని తమ దగ్గరుంచండి. రేపు ఉపాయం ఆలోచిస్తానని న్యాయాధికారన్నాడు.
ఆ రాత్రి ధర్మపాలుడు తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచించగా, ఆలోచించగా ఉపాయం తట్టింది.మరుసటిరోజు అదే ప్రదేశానికి విహారానికి వెడదామని సునందుడ్ని ధర్మపాలుడు ఆహ్వానించాడు. ఇద్దరూ ఆ చెట్టుదగ్గరకు చేరారు. ఉంగరం మీద మట్టి పోసి కనపడి కనపడనట్టుగా చేశాడు.
"ప్రభూ! దీన్ని పోగొట్టుకున్నవాడు తప్పకుండా వెదుక్కుంటూ వస్తాడు. ఇది ఎక్కడపోయింది,పోగొట్టుకున్న వాడికొక్కడికే తెలుసు. వాడు రహస్యంగా ఒంటరిగా వస్తాడు. వచ్చి చుట్టూ పరికించి చూస్తాడు. మట్టిని అటు ఇటు వస్తువు కనపడడానికి చిమ్ముతాడు. అప్పుడు ఇది బయటపడుతుంది. సంతోషంగా తీసుకుంటాడు. న్యాయంగా పోగొట్టుకున్న వాడికే చెందాలంటే ఇంతకన్నా మార్గం లేదని ధర్మపాలుడన్నాడు. పరాయి వాళ్లెవరైనా రేపో, మాపో ఇక్కడ విశ్రమించారనుకో, వాళ్లకు దక్కుతుంది గదా అని సునందుడన్నాడు.పరాయివాళ్లకు ఇక్కడ ఉంగరం పోయిందనే ఆలోచన ఉండదు. ఎందుకంటే వాళ్ల ఉంగరం పోలేదు కనుక.ఆలోచనొస్తే గదా వాళ్లు వెదికేది. వాళ్లకెందుకుంటుంది ఆలోచన అని ధర్మపాలుడన్నాడు. న్యాయం సరిగా జరగదేమో అన్న అభిప్రాయం రాజుగారికున్నా ధర్మపాలుడి ఆలోచన కాదనలేకపోయాడు. నాలుగురోజుల తర్వాత ధర్మపాలుడు, సునందుడు అదే చెట్టుదగ్గరికి విహారానికి వెళ్లారు. ప్రభూ! మీ పరిపాలన న్యాయంగా ఉంది. నేను పోగొట్టుకున్న ఉంగరం తిరిగి దొరికిందని ఉంగరం పోగొట్టుకున్న వాడు దండం పెడితే నిజంగా న్యాయం జరిగిందనిపించింది రాజుగారికి.


కోతుల సహాయం (11/07/2011)

ఒక నదిలో రకరకాల అందమైన చేపలు ఉన్నాయి. ఆ నది ఒడ్డున ఒక నేరేడుచెట్టు ఉంది. ఆ చెట్టు మీద కొన్ని కోతులు ఉన్నాయి. ఆ కోతులు నేరేడుచెట్టు కొమ్మల మీద గెంతుతూ, పండ్లు కోసుకు తినేవి. అప్పుడప్పుడూ కొన్ని పండ్లు జారి కింద ఉన్న నదిలో పడిపోయేవి. ఆ పండ్లు నీళ్ళలో మునిగిపోకుండా చేపలు వాటిని పట్టుకుని జాగ్రత్తగా తీసుకువచ్చి కోతులకు అందించేవి. అలా కోతులకు చేపలకు స్నేహం కుదిరింది.

ఒకరోజు చేపలు పట్టేవాడు అటువైపు వచ్చాడు. తన బట్టల మూటను ఒడ్డు మీద పెట్టి చేపల కోసం నీటిలోకి వల విసిరాడు. ఆ వలలో ఎన్నో చేపలు పడ్డాయి. అక్కడే చెట్టు మీద ఉన్న కోతులు జరుగుతున్నదంతా చూశాయి.

‘‘అయ్యయ్యో. మన మిత్రులను వాడు ఎత్తుకుపోతున్నాడు’’ అంది ఒక కోతి.
‘‘అవునవును. ఎలాగైనా సరే మనం మన మిత్రులను రక్షించుకోవాలి’’ అంది మరో కోతి.
అన్నింటిలోకి తెలివైన ఒక కోతి చేపలను కాపాడే ఉపాయం చెప్పింది. వెంటనే ఒక కోతి చెంగున కిందకు దూకింది. చేపలు పట్టేవాడి బట్టల మూటను ఎత్తుకుని పారిపోసాగింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనను చేపలు పట్టేవాడు చూశాడు.

‘‘అయ్యో నా బట్టలు’’ అంటూ వలను అక్కడే వదిలేసి కోతి వెంట పరుగెత్తాడు. అప్పుడు ఇంకో కోతి గబగబ చెట్టు మీద నుంచి కిందకు దిగింది. చేపలు ఉన్న వలను విప్పి, అందులో ఉన్న చేపలను నీళ్లల్లోకి వదిలేసింది. బట్టల మూట ఎత్తుకెళ్ళిన కోతి కొద్ది దూరం వెళ్ళాక మూటను కింద పడేసి పారిపోయింది. ఈ విధంగా కోతులు తమ మిత్రులను కాపాడుకున్నాయి.

నీతి : మంచివారితో స్నేహం ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది.


కందిరీగ సహాయం (11/07/2011)

ఒక అడవిలో ఒక చిలుక, కందిరీగ జీవిస్తూ ఉండేవి. చిలుక తనను తాను చూసుకుని గర్వంతో పొంగిపోయేది. కందిరీగను తరచుగా ఆటపట్టిస్తుండేది. ఒకరోజు చిలుక తన గూటిలో వుూడు గుడ్లు పెట్టింది. మరుసటి రోజు చిలుక నివసించే చెట్టు దగ్గరలో ఒక పిల్లి తచ్చాడుతుండడం గవునించింది. ‘‘అయ్యు బాబోయ్! నా గుడ్లను ఈ దొంగ పిల్లి తినేస్తుందేమో’’ అని తెగ కంగారు పడిపోరుుంది. అది అలా అనుకుంటూండగానే, పిల్లి ‘‘ఈ రోజుకు నాకీ గుడ్లు చాలు’’ అనుకుంటూ చెట్టును సమీపించి, మెల్లిగా చెట్టు ఎక్కడం మొదలెట్టింది. భయుంతో చెవుటలు పట్టిన చిలుక ‘‘కాపాడండి, కాపాడండి’’ అని అరవడం ప్రారంభించింది.

చిలుక అరుపులను, పెడబొబ్బలను అక్కడే తిరుగుతున్న కందిరీగ వింది. ఎందుకో అరుస్తోంది, నేను వెళ్లి దానిని కాపాడతాను’’ అని చిలుక దగ్గరకు బయులుదేరింది కందిరీగ.

కందిరీగ చిలుక గూటి దగ్గరకు వచ్చేసరికి, పిల్లి గూట్లోకి చూస్తూ ‘‘ఆహా! ఎంత అందమైన గుడ్లు, నా పంట పండింది’’ అనుకుంటూ గుడ్లను తీసుకోబోతుండగా, ఝువ్ముని ఎగురుతూ వచ్చిన కందిరీగ పిల్లి కంట్లోకి దూరింది. కంగారులో పిల్లి చెట్టు మీదినుంచి దూకేసింది. దాంతో పిల్లి కంటికి బలమైన గాయుమైంది. దానికితోడు చెట్టుపై నుంచి పడడంతో దానికి కాలు కూడా విరిగింది. గండం తప్పడంతో, కందిరీగ చిలుకతో, ‘‘మిత్రవూ, నీవిక బాధపడనవసరం లేదు’’ అని ఓదార్చింది. ‘‘నీ బుుణం ఈ జన్మలో తీర్చుకోలేను మిత్రవూ’’ అని చిలుక కందిరీగకు కృతజ్ఞతలు చెప్పింది.

‘‘నేను నా అందం చూసి తెగ గర్వపడే దానిని. ఆ గర్వంతో నేను నిన్ను ఆట పట్టించి అవవూనించేదానిని. కానీ నేను ప్రవూదంలో ఉన్నప్పుడు నువ్వు అదేమీ పట్టించుకోకుండా నన్ను కాపాడావు’’ అని పలికింది చిలుక.

‘‘సరేలే, ఈ రోజు నుంచి వున వుధ్య స్నేహం వురింత బలంగా చిగురించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం’’ అని బదులిచ్చింది కందిరీగ.

నీతి : మంచివారితో స్నేహం ఆపదల నుంచి బయటపడేస్తుంది. ఎవ్వరినీ ఎగతాళి చేయకూడదు.


కోతి తిక్క కుదిరింది (11/07/2011)

ఒక అడవిలోకి ఎక్కడి నుంచి వచ్చిందో కాని ఒక కోతి వచ్చి, పెద్ద రావి చెట్టు మీద ఉండసాగింది. ఆ చెట్టు మీద ఒక పావురం, పిచ్చుకల జంట, కాకి జీవిస్తున్నారుు. అవి ఒక దాని జోలికి వురొకటి వెళ్లేవి కావు. దేని ఆహారం అది సంపాదించుకుంటూప్రశాంతంగా జీవించేవి. కోతిది మాత్రం చంచల వునస్తత్త్వం.

అది ఒక్క క్షణం కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. కోతులన్నీ ఇలాగే ఉంటాయి, కానీ దీనిది వురీకోతి బుద్ధి. వుధ్యాహ్నం ఎండ పూట పక్షులు వాటి గూళ్లలో చిన్న కునుకు తీస్తుంటే కోతి దబ్బువుని ఒక కొవ్ము నుండి వురొక కొవ్ము మీదకు గెంతేది. ఆ చప్పుడును శత్రువుల దాడి అనుకుని పక్షులు ఠారెత్తిపోయేవి. ప్రాణరక్షణ కోసం తలా ఒకవైపు ఎగిరిపోయేవి.

కోతి చేష్టలతో ఆ పక్షులకు వునశ్శాంతి కరువరుుంది. అడవిలోని మిగతా జంతువుల పరిస్థితి ఎలా ఉన్నా రావిచెట్టు మీద నివసిస్తున్న పక్షుల పరిస్థితి వురీ అధ్వాన్నంగా తయూరరుుంది. ఒకరోజు అవన్నీ సమావేశమయ్యాయి.

‘‘రాను రాను కోతి చేష్టలు వురీ మితిమీరి పోతున్నారుు. ఎలాగోలా దీన్ని ఇక్కడ్నుంచి తరిమేయూలి’’ దిగులుగా అంది పిచ్చుక. ‘‘నాకో ఉపాయుం తట్టింది’’ అంటూ ఒక ఆలోచన చెప్పింది పావురం. ‘‘నిజంగా ఇలాగే జరుగుతుందా?’’ సందేహంగా అడిగింది కాకి.

‘‘ప్రయుత్నించి చూద్దాం. ఇది పని చేయుకపోతే వురొకటి ఆలోచిద్దాం. నాకెందుకో ఈ దెబ్బతో కోతి పని అరుుపోతుందని అనిపిస్తుంది’’ అన్నది కాకి. అన్నీ కలసి తేనెను సంపాదించి కోతి నివసించే చోట ఒక రంధ్రంలో పోశారుు. కోతి ఎప్పటిలాగే అడవిలోని జంతువులను, పక్షులను హడలగొట్టడం పూర్తయ్యాక తిరిగి వచ్చింది. వుుందు ఆ తేనెను చూసి సంశయుంగా ఒక వేలితో తాకి, నాకి చూసింది. దానికి ఆ రుచి నచ్చింది. మొత్తం తేనెను నాకేసింది. అది మొదలు ఒక వారం పాటు పక్షులు రోజూ తేనెను సంపాదించి ఆ రంధ్రంలో పోసేవి. కోతి ఆ తేనెను తాగేది. నెవ్ముదిగా అది తేనె రుచికి అలవాటు పడింది. కొన్ని తేనె చుక్కలు గొంతులో పడితే కాని ఉండలేని స్థితికి వచ్చింది.

పక్షులు తమ పథకంలో భాగంగా ఒకరోజు తేనెను పోయలేదు. రంధ్రంలో తేనె కనిపించక పోయేసరికి కోతికి పిచ్చి పట్టినంత పనైంది. చెట్టంతా వెతికింది. దానికి చిటారు కొవ్మున తేనెతుట్టె కనిపించింది. తేనె కోసం ఆతృతగా తేనెతుట్టెలో వేలు పెట్టి కెలికింది. తుట్టె కదలడంతో తేనెటీగలు పైకి లేచారుు. వందలు... వేల... తేనెటీగలు ఒక్కసారిగా కోతిపై దాడి చేసారుు. వాటి బారి నుండి తప్పించుకోవడానికి కోతి పరుగో పరుగు! తేనెటీగలేమో కోతిని వెంబడించి కసిదీరా కుట్టి వదిలారుు. చావు తప్పి కన్ను లొట్టబోరుున పరిస్థితి అరుుంది కోతికి. ఇక ఆ పరిసరాలలోకి వస్తే ఒట్టు. కోతి బాధ తప్పిపోరుునందుకు పక్షులు ఆనందించారుు.


More Stories: 1 | 2 | 3 | 4